Tuesday, July 29, 2008

స్ఫూర్తిప్రదాతకు శ్రద్ధాంజలి... నమః సుమాంజలి

సూర్నిగంటి శ్యాం సుందర్, అందరికీ SHAMగా సుపరిచితుడు. ఎంతో మందికి స్పూర్తి ప్రదాత, ఆదర్శప్రాయుడు అయిన SHAM ఈ లోకాన్ని విడిచిపెట్టి నేటికి సరిగ్గా 3 సంవత్సరాలు. అందరికీ భౌతికంగా మాత్రమే దూరమయ్యాడు. కానీఇప్పటికీ ఎంతోమంది మదిలో సుస్థిరస్థానం సంపాదించుకున్నాడు. మనసు నిండా జ్ఞాపకాలతో ఇంకా ఈలోకంలో బ్రతికే ఉన్నాడు. విలక్షణ వ్యక్తిత్వం అతని సొంతం. విచిత్రమైన వ్యవహారశైలి అతని ప్రత్యేకం. నేడు ఎంతో మందికి విలువల బాటలు పరిచిన ఆ మహోన్నత వ్యక్తికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ సందర్బంగా అతని గురించి తెలిసిన కొన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావించుకుందాం.
  • బయటి ప్రపంచానికి ఈటీవీ రిపోర్టర్ గా మాత్రమే తెలిసిన SHAM నిజానికి ఓ గొప్ప మానవతావాది. విలువలు, నీతి, నిజాయితీ కానరాని ఈ సమాజంలో వాటి కోసం నిత్యం పరిశ్రమించిన శ్రామికుడు.
  • Hyderabad Central University లో M.A (Mass Communication & Journalism) చేసిన Sham, తన సహచరుల్లా విలాసవంతమైన జీవితాన్ని కోరుకోలేదు. నేరుగా ETVలో ఉద్యోగం దొరికింది. మొదట్లో PCR, Productionలో పనిచేసాడు. తర్వాత Reporting చేయాలన్న బలీయమైన కాంక్షతో హైదరాబాద్ బ్యూరోలో రిపోర్టర్ గా జర్నలిస్టు జీవితం ప్రారంభించాడు.
  • బడుగు జీవి కష్టాన్ని తీర్చడంలో ఆనందాన్ని వెతుక్కునేవాడు. పేదవాడి ఆకలి తీర్చడంలో సంతృప్తి పడేవాడు. అందుకే ఏరి కోరి Crime Reporting ఎంచుకున్నాడు. సమాజంలోని అవినీతి అక్రమాలు బయటకు తీయడమే శ్వాసగా జీవించాడు. సంచలనాలకు పోకుండా సమాజ శ్రేయస్సే ఆశయంగా అనుక్షణం పరితపించాడు.
  • Telugu Electronic Media లో 24X7 News Channels రాకముందు నుంచే Investigative Journalism అంటే ఏంటో అందరికీ నేర్పాడు. Spy Camera టెక్నాలజీ రాకముందే Investigation చేసి చూపించాడు. అలాంటి కథనాలతో సంచలనం సృష్టించాడు. అంతే కాని సంచలనం కోసమే కథనాలు చేయలేదు.
  • మందు ముట్టనివాడు జర్నలిస్టు కాజాలడు అని చెప్పుకునే ఈ రోజుల్లో ఎలాంటి దురలవాట్లు లేకుండా అందరికీ ఆదర్శంగా నిలిచాడు. తన శిష్యులను అలాగే తయారు చేసాడు. అతి చిన్న వయస్సులోనే సమాజాన్ని ఔపోసన పట్టాడు.
  • ETVలో పనిచేస్తున్న సమయంలో అతని అనన్య సామాన్యమైన ఆశయాలను గురించి తెలుసుకున్న CNN-iBN పిలిచి అవకాశం ఇచ్చింది. ఆనాటి వరకు తెలుగు రాయడం రాని తెలుగు జర్నలిస్టులలో Sham మాత్రమే ఎన్నో సాధించాడు. స్క్రిప్ట్ వర్క్ మొత్తం ఇంగ్లీష్ లోనే ఉండేది. ఎంతో చక్కగా భావాన్ని వ్యక్తీకరించేవాడు.
  • తన ఆలోచనలకు అద్దం పట్టేలా ఒక షార్ట్ ఫిల్మ్ (లఘు చిత్రం) తీశాడు. సమాజంలో పెడదోవ పట్టిన విలువల వలువలు ఊడదీసి ఉతికి ఆరేశాడు. కాని ఆ షార్ట్ ఫిల్మ్ తీసిన కొద్ది రోజులకే అందరినీ విడిచి అనంతలోకాలకు పయనమయ్యాడు.

ఇక అతని నాయకత్వ లక్షణాల గురించి ఎంత చెప్పినా తక్కువే. తను ఎదగాలి, తనతోటి వాళ్లు ఎదగాలి అనుకునేవాడు. స్వార్ధపూరిత సమాజంలో నిస్వార్ధంగా పనిచేశాడు. అందరికీ తలలో నాలుకలా మెలిగాడు. స్నేహానికి ప్రాణం ఇచ్చేవాడు. ప్రేమకు కొత్త భాష్యం చెప్పాడు. కాని ఇప్పుడు అతన్ని ప్రేమించే వారికి దూరమయ్యాడు. ఎప్పుడో జరిగిన ఓ ప్రమాదం అతన్ని జీవితాంతం వెంటాడింది. కంటి చూపును మింగేసి అతన్ని మాకు కాకుండా చేసింది. మా జ్ఞాపకాల్లో ఎన్నటికీ బ్రతికుండే అతనికోసం, అతని ఆశయాల సాధనకోసం నిత్యం పరిశ్రమిస్తూ, పరిక్లమిస్తూ, ప్రతిజ్ఞ చేస్తూ సెలవు తీసుకుంటున్నా...

మీ

Mahatma Kodiyar,

Crime Bureau, NTV

3 comments:

Anonymous said...

SHAM,abt him I can say only one thing.We have lost a true journalist who can save lots of life,and even more.never & Ever we cant see in our life like this person......

keshav said...

'శ్యాం' స్మరణ
వీడికి నవ్వడం తెలుసు...
నవ్వించడం తెలుసు...
వెక్కిరించడం తెలుసు...
విసిగించడం తెలుసు...
కన్నీళ్ళు తెప్పించడం కూడా తెలుసని
మేం తెలుసుకొని అప్పుడే మూడేళ్ళు...

క్రైం రిపోర్టర్ కదా
'మస్త్ శవం తెచ్చా హెడ్ లైన్ చెయ్
బుద్ది లేకుండా ఎందుకు చస్తార్రా భాయ్'
ఇదీ వాడి ధోరణి
' ఎవడేమన్నా లైట్ తీస్కొ నచ్చిన పని చెయ్
పక్కనున్న ప్రతివాణ్ణీ కాదు, ఫ్రెండ్ని నమ్ము'
ఇదీ వాడి ఫిలాసఫి...

వాడు దుడుకు మనిషి
నాది కుదురు స్వభావం
నేను ముడుచుకుపోతాను
వాడు విరుచుకుపడతాడు
నేను కనిపించినంత సౌమ్యుడిని కాదు
వాడు వినిపించినంత కఠినుడూ కాదు
మనసు గాయపడితే మాత్రం
ఇద్దరం ఒకేలా స్పందిస్తాం
అందుకే వాడంటే నాకిష్టం

వాడు ఇక లేడని తెలిసినప్పుడు
ఆ దు:ఖం నుంచి తేరుకోడానికి
కనీసం మూడు రోజులు పట్టింది
వాడి జ్ఞాపకాలను వొదులుకోవాలంటే
ఒక జన్మంతా సరిపోదేమో...
వాడు చాలా విలువైన మనిషి
విలువలున్న మనిషి...

కానీ ఎప్పుడో ఒకసారి ఎదురుపడితే
ఏ బుద్ధితో మాకు దూరమయ్యడో అడగాలి
ఏ స్నేహం వాడి మనసుని చిదిమేస్తే
ఇంత పనీ చేశాడో ఆరా తీయాలి...
ఎప్పటినుంచో మనసు తొలుస్తున్న ప్రశ్నలివి!!

మా 'షేమ్' గాడిని గుర్తుచేసుకున్నందుకు ఆనందంగా...
వాడికి ఏడవటమంటే అస్సలు నచ్చదు కదా...

-కేశవ్
www.kesland.blogspot.com

seshu said...

hello
kesav garu... shaym gurinchi chala goppaaga rasaru...
nenu jornalisam looki vachee natiki shaym garu ee lokaanii vidicha petti velladam naku bagdha kliginchindi....
aantha goppa personiloity gutinchi yentha cheppina thakkuveeeeee

meee seshu...
ssnath_seshu@yahoo.co.in