Friday, August 1, 2008


'శ్యాం' స్మరణ



వాడికి నవ్వడం తెలుసు...
నవ్వించడం తెలుసు...
వెక్కిరించడం తెలుసు...
విసిగించడం తెలుసు...

కన్నీళ్ళు తెప్పించడం కూడా తెలుసని
మేం తెలుసుకొని అప్పుడే మూడేళ్ళు...
క్రైం రిపోర్టర్ కదా'మస్త్ శవం తెచ్చా హెడ్ లైన్ చెయ్
బుద్ధి లేకుండా ఎందుకు చస్తార్రా భాయ్'
ఇదీ వాడి ధోరణి'

ఎవడేమన్నా లైట్ తీస్కొ నచ్చిన పని చెయ్..
పక్కనున్న ప్రతివాణ్ణీ కాదు, ఫ్రెండ్ని నమ్ము'
ఇదీ వాడి ఫిలాసఫి...


వాడు దుడుకు మనిషి
నాది కుదురు స్వభావం
నేను ముడుచుకుపోతాను
వాడు విరుచుకుపడతాడు
నేను కనిపించినంత సౌమ్యుడిని కాదు
వాడు వినిపించినంత కఠినుడూ కాదు
మనసు గాయపడితే మాత్రం
ఇద్దరం ఒకేలా స్పందిస్తాం
అందుకే వాడంటే నాకిష్టం
వాడు ఇక లేడని తెలిసినప్పుడు
ఆ దు:ఖం నుంచి తేరుకోడానికి
కనీసం మూడు రోజులు పట్టింది
వాడి జ్ఞాపకాలను వొదులుకోవాలంటే
ఒక జన్మంతా సరిపోదేమో...
వాడు చాలా విలువైన మనిషి
విలువలున్న మనిషి...

కానీ ఎప్పుడో ఒకసారి ఎదురుపడితే
ఏ బుద్ధితో మాకు దూరమయ్యడో అడగాలి
ఏ స్నేహం వాడి మనసుని చిదిమేస్తే
ఇంత పనీ చేశాడో ఆరా తీయాలి...
ఎప్పటినుంచో మనసు తొలుస్తున్న ప్రశ్నలివి!!


మా 'షేమ్' గాడిని గుర్తుచేసుకున్నందుకు ఆనందంగా...
వాడికి ఏడవటమంటే అస్సలు నచ్చదు కదా...

-కేశవ్ www.kesland.blogspot.com

No comments: