- బయటి ప్రపంచానికి ఈటీవీ రిపోర్టర్ గా మాత్రమే తెలిసిన SHAM నిజానికి ఓ గొప్ప మానవతావాది. విలువలు, నీతి, నిజాయితీ కానరాని ఈ సమాజంలో వాటి కోసం నిత్యం పరిశ్రమించిన శ్రామికుడు.
- Hyderabad Central University లో M.A (Mass Communication & Journalism) చేసిన Sham, తన సహచరుల్లా విలాసవంతమైన జీవితాన్ని కోరుకోలేదు. నేరుగా ETVలో ఉద్యోగం దొరికింది. మొదట్లో PCR, Productionలో పనిచేసాడు. తర్వాత Reporting చేయాలన్న బలీయమైన కాంక్షతో హైదరాబాద్ బ్యూరోలో రిపోర్టర్ గా జర్నలిస్టు జీవితం ప్రారంభించాడు.
- బడుగు జీవి కష్టాన్ని తీర్చడంలో ఆనందాన్ని వెతుక్కునేవాడు. పేదవాడి ఆకలి తీర్చడంలో సంతృప్తి పడేవాడు. అందుకే ఏరి కోరి Crime Reporting ఎంచుకున్నాడు. సమాజంలోని అవినీతి అక్రమాలు బయటకు తీయడమే శ్వాసగా జీవించాడు. సంచలనాలకు పోకుండా సమాజ శ్రేయస్సే ఆశయంగా అనుక్షణం పరితపించాడు.
- Telugu Electronic Media లో 24X7 News Channels రాకముందు నుంచే Investigative Journalism అంటే ఏంటో అందరికీ నేర్పాడు. Spy Camera టెక్నాలజీ రాకముందే Investigation చేసి చూపించాడు. అలాంటి కథనాలతో సంచలనం సృష్టించాడు. అంతే కాని సంచలనం కోసమే కథనాలు చేయలేదు.
- మందు ముట్టనివాడు జర్నలిస్టు కాజాలడు అని చెప్పుకునే ఈ రోజుల్లో ఎలాంటి దురలవాట్లు లేకుండా అందరికీ ఆదర్శంగా నిలిచాడు. తన శిష్యులను అలాగే తయారు చేసాడు. అతి చిన్న వయస్సులోనే సమాజాన్ని ఔపోసన పట్టాడు.
- ETVలో పనిచేస్తున్న సమయంలో అతని అనన్య సామాన్యమైన ఆశయాలను గురించి తెలుసుకున్న CNN-iBN పిలిచి అవకాశం ఇచ్చింది. ఆనాటి వరకు తెలుగు రాయడం రాని తెలుగు జర్నలిస్టులలో Sham మాత్రమే ఎన్నో సాధించాడు. స్క్రిప్ట్ వర్క్ మొత్తం ఇంగ్లీష్ లోనే ఉండేది. ఎంతో చక్కగా భావాన్ని వ్యక్తీకరించేవాడు.
- తన ఆలోచనలకు అద్దం పట్టేలా ఒక షార్ట్ ఫిల్మ్ (లఘు చిత్రం) తీశాడు. సమాజంలో పెడదోవ పట్టిన విలువల వలువలు ఊడదీసి ఉతికి ఆరేశాడు. కాని ఆ షార్ట్ ఫిల్మ్ తీసిన కొద్ది రోజులకే అందరినీ విడిచి అనంతలోకాలకు పయనమయ్యాడు.
ఇక అతని నాయకత్వ లక్షణాల గురించి ఎంత చెప్పినా తక్కువే. తను ఎదగాలి, తనతోటి వాళ్లు ఎదగాలి అనుకునేవాడు. స్వార్ధపూరిత సమాజంలో నిస్వార్ధంగా పనిచేశాడు. అందరికీ తలలో నాలుకలా మెలిగాడు. స్నేహానికి ప్రాణం ఇచ్చేవాడు. ప్రేమకు కొత్త భాష్యం చెప్పాడు. కాని ఇప్పుడు అతన్ని ప్రేమించే వారికి దూరమయ్యాడు. ఎప్పుడో జరిగిన ఓ ప్రమాదం అతన్ని జీవితాంతం వెంటాడింది. కంటి చూపును మింగేసి అతన్ని మాకు కాకుండా చేసింది. మా జ్ఞాపకాల్లో ఎన్నటికీ బ్రతికుండే అతనికోసం, అతని ఆశయాల సాధనకోసం నిత్యం పరిశ్రమిస్తూ, పరిక్లమిస్తూ, ప్రతిజ్ఞ చేస్తూ సెలవు తీసుకుంటున్నా...
మీ
Mahatma Kodiyar,
Crime Bureau, NTV